బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: రాజధాని కబడ్డీ!

| Edited By:

Dec 26, 2019 | 10:51 PM

తాజాగా.. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించేవారు హెచ్చరికలు చేస్తుంటే, జగన్‌ సర్కార్‌ మాత్రం రైతులకు భరోసా ఇస్తూ, విపక్షాలపై ఎదురుదాడి చేస్తూ, కాగల కార్యానికి ఎజెండా సెట్‌ చేస్తోంది. రేపటి కేబినెట్‌ భేటీలో మూడు రాజధానులను ఖరారు చేస్తే ధర్నాలు, బంద్‌లకు ప్రతిపక్షాలు స్కెచ్‌ గీశాయి. అటు కొందరు రాయలసీమ నేతలు రాష్ట్ర విభజన డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. దీంతో రేపటి కేబినెట్‌ భేటీ అనేది హైటెన్షన్‌ అంశమైంది. రాజధాని కేంద్రంగా తొమ్మిది రోజులుగా సాగుతున్న రాజకీయ రగడపై […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: రాజధాని కబడ్డీ!
Follow us on

తాజాగా.. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించేవారు హెచ్చరికలు చేస్తుంటే, జగన్‌ సర్కార్‌ మాత్రం రైతులకు భరోసా ఇస్తూ, విపక్షాలపై ఎదురుదాడి చేస్తూ, కాగల కార్యానికి ఎజెండా సెట్‌ చేస్తోంది. రేపటి కేబినెట్‌ భేటీలో మూడు రాజధానులను ఖరారు చేస్తే ధర్నాలు, బంద్‌లకు ప్రతిపక్షాలు స్కెచ్‌ గీశాయి. అటు కొందరు రాయలసీమ నేతలు రాష్ట్ర విభజన డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. దీంతో రేపటి కేబినెట్‌ భేటీ అనేది హైటెన్షన్‌ అంశమైంది. రాజధాని కేంద్రంగా తొమ్మిది రోజులుగా సాగుతున్న రాజకీయ రగడపై ఇవాళ్టి బిగ్‌ డిబేట్.

జీఎన్‌ రావు కమిటీ నివేదికపై శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్‌ భేటీపై అమరావతిలో టెన్షన్‌ నెలకొంది.ఈ పరిస్థితుల్లో- సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి బొత్స నేతృత్వంలో కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు భేటీ అయి రైతుల ఆందోళనలు, రాజధాని ప్రకటన తర్వాతి రాజకీయ పరిణామాలపై చర్చించారు.

కీలకభేటీ జరుగుతున్న సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గరకి రైతులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అటు- సచివాలయంలో కేబినెట్‌ భేటీ నిర్వహిస్తే నిరసనలు వ్యక్తం కావచ్చని ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇచ్చింది. దీంతో కేబినెట్‌ భేటీకి వేదిక సచివాలయమా, సీఎం క్యాంపు ఆఫీసా అన్నదానిపై అధికారులు ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ పొలిటికల్‌ హైటెన్షన్‌లో శనివారం సీఎం జగన్‌ విశాఖ టూర్‌ ఎజెండాను వైసీపీ ఎంపీ విజయసాయి ఖరారు చేశారు. వెంటనే 7 జీవోలతో విశాఖ అభివృద్ధికి 394 కోట్లు మంజూరయ్యాయి.