ఫ్లైట్ లెఫ్టినెంట్ భావన అత్యంత అరుదైన ఘనత సాధించారు. యుద్ధ విమానాన్ని ఉపయోగించి, పగటిపూట యుద్ధం చేయడానికి ఆమె అర్హత సాధించారు. ఇక మిగ్-21 బైసన్ సూపర్‌సానిక్ జెట్‌తో ఆమె యుద్ధ రంగంలో తన సత్తా చాటవచ్చు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
భావన బిహార్‌లోని దర్భంగాకు చెందినవారు. మిగ్-21 ట్రైనింగ్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. బికనీర్‌లోని నాల్ ఎయిర్‌బేస్‌లో ఆమె శిక్షణ పొందారు. 2017 నవంబరులో భావన ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరారు. 2018 మార్చిలో మిగ్-21 బైసన్‌ను మొదటిసారి స్వయంగా నడిపారని భారత వాయు సేన అధికార ప్రతినిథి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు.
#WomenPower: Flt Lt Bhawana Kanth adds another feather to her cap by completing Day Operational syllabus on MiG-21 Bison aircraft. She is the first women fighter pilot to be qualified to undertake missions by day on a fighter aircraft. pic.twitter.com/J5SWN8A4oD
— Indian Air Force (@IAF_MCC) May 22, 2019
#WomenPower: Bhawana joined the fighter squadron in Nov 2017 & flew the 1st solo on MiG-21 Bison in Mar 2018. With her dedication, hard work & perseverance she has become the 1st women Officer to achieve this feat. She is from the first batch of women fighter pilots of the IAF. pic.twitter.com/v2voizwFyO
— Indian Air Force (@IAF_MCC) May 22, 2019