దేశంలో రైతుల నిరసనలను సమర్థిస్తున్నట్టు విదేశీ సెలబ్రిటీలు ట్వీట్స్ చేయడంపై ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో సెటైర్లు కురిపించారు. దీన్ని ‘ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ’గా ఆయన అభివర్ణించారు. విదేశీ వినాశకపూర్వక సిధ్ధాంతం అంటే ఇదేనన్నారు. పరిశ్రమలు వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్) అన్న పదాన్ని ఈ విధంగా సవరించి ఆయన వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి అనవసరమైన, తొలగించదగిన అనుచిత ధోరణులు చోటు చేసుకుంటున్నాయని, వీటిపట్ల దేశం అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. ( అమెరికన్ పాప్ సింగర్ రిహానా, క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ వంటివారు రైతుల ఆందోళనపై స్పందించిన విషయం గమనార్హం..)
రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నామని, వారు కేంద్రంతో ఎప్పుడైనా చర్చలకు రావచ్చునని మోదీ అన్నారు.’ ఈ దేశం సిక్కులంటే ఎంతో గౌరవం చూపుతోంది.. వారి పట్ల గర్విస్తోంది. ఈ దేశానికి వారు ఎన్నో సేవలు చేశారు’ అని ఆయన అన్నారు. అన్నదాతల ఆందోళనకు సిక్కులు నేతృత్వం వహిస్తున్న విషయాన్ని ఆయన ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. నిరసనకారుల్లో ‘ఆందోళన్ జీవి’ అనే కొత్త కేటగిరీ పుట్టుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
‘రైతులతో సమావేశమవుతాం, వారితో చర్చిస్తాం.. సభలో ఈ ఆహ్వానాన్ని ప్రకటిస్తున్నా’ అని మోదీ స్పష్టం చేశారు. కనీస మద్దతుధర కొనసాగుతుందని, దీనిపై ఆందోళన అనవసరమని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధామిస్తూ ఆయన.. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అన్నదాతలు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
Also Read:
కోడెల శివప్రసాదరావు కుమారుడికి లిక్కర్ డబ్బులు లేవా..? పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
గుర్రంపై పెళ్లి మండపానికి వెళ్ళిన వధువు.. అమ్మాయిలకు కూడా సమాన హాక్కులుంటాయంటున్న పెళ్లికూతురు..