Bengaluru City: మరో అరుదైన ఘనత సాధించిన బెంగళూరు నగరం.. ఆ విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానం..

|

Jan 15, 2021 | 5:24 AM

Bengaluru City Set New Record: ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కర్ణాటక రాజధాని బెంగళూరు. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో..

Bengaluru City: మరో అరుదైన ఘనత సాధించిన బెంగళూరు నగరం.. ఆ విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానం..
Follow us on

Bengaluru City Set New Record: ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కర్ణాటక రాజధాని బెంగళూరు పట్టణం. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటైన బెంగళూరు ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులకు నెలవుగా మారిన విషయం తెలిసిందే.
అయితే ఈ క్రమంలోనే బెంగళూరు పట్టణం మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రపచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న టెక్‌ నగరంగా రికార్డు సృష్టించింది. ఇక బెంగళూరు తర్వాతి స్థానాల్లో లండన్‌, మ్యూనిక్‌, బెర్లిన్‌, పారిస్‌ నగరాలున్నాయి. ఇక టాప్‌ టెన్‌ నగరాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై చోటు దక్కించుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతోన్న టెక్‌ నగరాల్లో ముంబై 6వ స్థానంలో నిలిచింది. ఇక 2016 నుంచి 2020 వరకు బెంగళూరులో పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగితే.. లండన్‌లో 3 రెట్లు పెరగడం గమనార్హం. లండన్‌కు చెందిన ‘డీల్‌రూమ్‌’ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న పది నగరాల్లో భారతదేశానికి చెందిన రెండు నగరాలు ఉండడం విశేషం.

Also Read: 1000 మంది గర్ల్‌ ఫ్రెండ్స్.. 1075 సంవత్సరాల జైలు శిక్ష.. అసలేం జరిగింది.? అతడెవరు.?

 

, London second