మామూలోడు కాదు ఈ మతగురువు.. ఉదయం బోధనలు రాత్రికి రాసలీలలు.. ఏకంగా 1000 మంది గర్ల్‌ ఫ్రెండ్స్..

Adnan Oktar Jailed: 1000 మంది గర్ల్‌ ఫ్రెండ్స్.. 69,000 అబార్షన్ పిల్స్.. 10 క్రిమినల్ కేసులు… ఇవన్నీ కూడా అండర్ వరల్డ్ డాన్ చేసి ఉంటాడనుకుంటే పొరపాటే..

  • Ravi Kiran
  • Publish Date - 8:11 pm, Thu, 14 January 21
Turkish Religious Cult Leader Adnan Oktar

Adnan Oktar Jailed: 1000 మంది గర్ల్‌ ఫ్రెండ్స్.. 69,000 అబార్షన్ పిల్స్.. 10 క్రిమినల్ కేసులు… ఎవరో అండర్ వరల్డ్ డాన్ గురించి చెబుతున్నానని అనుకుంటే పొరపాటే.. ఈ అరాచకాలకు మూల కారణం టర్కీకి చెందిన ఓ ముస్లిం మత గురువు. అతడే  అద్నాన్ ఓక్తర్.  సొంతంగా కల్ట్ అనే మత సంస్థను కూడా నడిపిస్తున్నాడు. కానీ ప్రాసిక్యూటర్లకు మాత్రం అది ఒక నేర సంస్థ. ప్రజలందరినీ సరైన మార్గంలో నడిపిస్తానంటూ స్పీచ్‌లు ఇచ్చే ఈ గురువు మత ప్రచారం ముసుగులో అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇక ఇప్పుడు వాటికి శిక్ష అనుభవిస్తున్నాడు.

తనను ఓ పెద్ద మత బోధకుడు, రచయితగా అభివర్ణించుకునే అద్నాన్ ఓక్తర్‌కు టర్కీ కోర్టు 1075 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులు, మహిళలపై అత్యాచారాలు, క్రిమినల్ ముఠాలను తయారు చేయడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మొదలగు ఆరోపణలు అతడిపై ఉన్నాయి. సాంప్రదాయక అభిప్రాయాలను బోధించే ఓక్తర్.. స్త్రీలు తన ‘పెంపుడు పిల్లి’ (పిల్లుల) అని అంటుంటాడు.

అంతేకాకుండా అతడికి సొంత టీవి స్టూడియో కూడా ఉంది. అతడి చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలు నాట్యం చేసేవారు. తనకు సుమారు 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఓక్తర్ స్వయంగా జడ్జికి చెప్పాడు. ఇక అతడి ఇంటి నుంచి సుమారు 69,000 గర్భనిరోధక మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని చర్మ అలెర్జీలు, రుతుస్రావాల సమయంలో ఏర్పడే ఇబ్బందుల కోసం మహిళలు ఉపయోగిస్తారని అతడు పోలీసులకు తెలిపాడు.

2018లో ఓక్తర్, అతడి అనుచరులు అరెస్ట్…

అద్నాన్ ఓక్తర్‌ను 2018లో పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు 78 మంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓక్తర్, మరో 13 మంది నిందితులకు మొత్తంగా 9803 సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది. వారిలో ఓక్తర్‌ మాత్రమే 10 కేసుల్లో దోషిగా తేలిగా.. అతడికి 1075 సంవత్సరాల జైలు శిక్ష పడింది.