కామన్ ఆటోవాలా.. ఆవిడ.. ఖరీదైన విల్లా
అతడు అందరిలా ఓ సాధారణ ఆటోవాలా. ఇంతవరకు ఇన్‌కమ్ టాక్స్ కట్టిన దాఖలాలు కూడా లేవు. అయితే కాస్ట్‌లీ ఏరియాలో ఓ విల్లాను కొనేసి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు ఆ విల్లాపై దాడి చేయడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ అంటే పోష్ ఏరియాకు పెట్టింది పేరు. అక్కడ ఒక్కో గజమే కొన్ని లక్షల ఖరీదు చేస్తుంది. ఇక అక్కడ విల్లాను కొనాలనుకుంటే.. డబ్బున్న మారాజులైతే చేతికి ఎముక […]

అతడు అందరిలా ఓ సాధారణ ఆటోవాలా. ఇంతవరకు ఇన్‌కమ్ టాక్స్ కట్టిన దాఖలాలు కూడా లేవు. అయితే కాస్ట్‌లీ ఏరియాలో ఓ విల్లాను కొనేసి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు ఆ విల్లాపై దాడి చేయడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ అంటే పోష్ ఏరియాకు పెట్టింది పేరు. అక్కడ ఒక్కో గజమే కొన్ని లక్షల ఖరీదు చేస్తుంది. ఇక అక్కడ విల్లాను కొనాలనుకుంటే.. డబ్బున్న మారాజులైతే చేతికి ఎముక లేకుండా నీళ్లలా డబ్బులు ఖర్చుపెట్టి విల్లాలు కొనేస్తారు. అలాంటి ఏరియాలో ఓ లగ్జరీ విల్లాను కొనేశాడు ఆటోడ్రైవర్ సుబ్రమణి. అందుకు 1.6కోట్ల రూపాయల్ని ఒకేసారి విల్లా యజమానికి చెల్లించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఐటీ అధికారులు, అతడి ఇంటిపై బుధవారం దాడి చేశారు. ఈ నేపథ్యంలో సుబ్రమణి దగ్గర నుంచి దాదాపు రూ.7కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రాజకీయ నాయకులతో సంబంధాలు కాగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తోన్న సుబ్రమణికి బెంగళూరులోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీతో పాటు మహదేవపుర ఎమ్మెల్యే అరవింద్ లింబవలీతో సుబ్రమణికి సాన్నిహిత్యం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలను అరవింద్ కొట్టేశారు. సుబ్రమణితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనను కావాలనే ఇరికిస్తున్నారంటూ ఆయన విరుచుకుపడ్డారు.
చిన్న సాయానికే ఇంత పెద్ద బహుమతా..! మరోవైపు విల్లాను తాను కొనడంపై సుబ్రమణి తన తరఫున కథను చెబుతున్నాడు. కొన్నాళ్ల క్రితం భారీ వర్షపు రోజు ఓ విదేశీ వృద్ధురాలికి తాను ఉచితంగా తన ఆటోలో ఆమెను గమ్యానికి చేర్చానని.. ఆ తరువాత తన కుటుంబ దుస్థితిని తెలుసుకున్న ఆవిడ, ఈ విల్లాను బహుమతిగా ఇచ్చిందని వెల్లడించాడు. తనలాగే మరికొంతమంది ఆటో డ్రైవర్లకు కూడా ఆమె సహాయం చేసిందని సుబ్రమణి పేర్కొన్నాడు.
సుబ్రమణి వెనుక పెద్ద స్టోరీ అయితే ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న సుబ్రమణి వెనుక పెద్ద కథ ఉన్నట్లు సమాచారం. ఫినాన్స్ బిజినెస్‌లోనూ రాణిస్తోన్న సుబ్రమణి.. అధిక వడ్డీతో ఆటో డ్రైవర్‌లకు డబ్బులు ఇచ్చేవాడని.. అంతేకాకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని వాటిని అమ్మేవాడని కొందరు చెబుతున్నారు. కాగా సుబ్రమణిపై బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం కింద అధికారులు కేసు నమోదు చేశారు.