బీరుట్ పేలుళ్లు: నగరంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

|

Aug 07, 2020 | 9:00 PM

పేలుళ్ల వ‌ల్ల భారీ ప్రాణ‌, ఆస్థి న‌ష్టం సంభ‌వించిన అనంత‌రం గురువారం బీరుట్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలలో నిరసనకారులు లెబనీస్ భద్రతా దళాలతో గొడవ పడ్డారు.

బీరుట్ పేలుళ్లు: నగరంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
Follow us on

Beirut explosion  : పేలుళ్ల వ‌ల్ల భారీ ప్రాణ‌, ఆస్థి న‌ష్టం సంభ‌వించిన అనంత‌రం గురువారం బీరుట్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలలో నిరసనకారులు లెబనీస్ భద్రతా దళాలతో గొడవ పడ్డారు. ప‌రిస్థితి ఆందోళన‌క‌రంగా మారడంతో పార్లమెంటు సమీపంలో ప్రజలపై అధికారులు బాష్ప‌ వాయువును ప్ర‌యోగించారు. మంగళవారం జరిగిన వినాశకరమైన పేలుడుతో ప్ర‌జ‌ల్లో తీవ్ర‌ ఆగ్రహ జ్వాల‌లు చెల‌రేగాయి. పేలుళ్లు జ‌రిగిన ప్ర‌దేశంలో‌ 2013 సంవ‌త్స‌రం నుంచి 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఎటువంటి జాగ్ర‌త్త‌లు లేకుండా నిల్వ చేయబడిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పేలుడుకు దారితీసిందని, దీని వ‌ల్ల 137 మంది మృతి చెందారని, 5,000 మంది గాయపడ్డారని లెబనాన్‌లో ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పేలుడు రాజధానిలోని మొత్తం ప్ర‌దేశాల‌ను ఎఫెక్ట్ చేసింది. ఇళ్ళు, వ్యాపార సంస్థ‌లు శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా మంది ప్ర‌జ‌ల ఆచూకీ ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. ఈ వారం ప్రభుత్వం ప్రాథ‌మిక‌ దర్యాప్తులో భాగంగా 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక‌ వార్తా సంస్థ తెలిపింది. విపత్తు తరువాత ఇద్దరు అధికారులు రాజీనామా చేశారు. ఎంపి మార్వాన్ హమదే బుధవారం పదవీవిరమణ చేయగా, జోర్డాన్ లెబనాన్ రాయబారి ట్రేసీ చమౌన్ గురువారం పదవీవిరమణ చేశారు. ఈ విపత్తు నాయకత్వంలో మార్పు అవసరాన్ని సూచిస్తోందని ఆయ‌న‌ అన్నారు.

 

Read More : ఏపీ క‌రోనా అప్‌డేట్స్ : జిల్లాల వారీగా