Pedicure tips at Home: చాలా మందికి పాదాల అందంపై అంతగా శ్రద్ధ ఉండదు. దుమ్ముపట్టి మురికిగా ఉన్నపాదాలతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంపడిపోతుంటారు. నల్లగా మారి అందవిహీనంగా కనిపించే పాదాల చర్మం మెరుపులీనాడానికి మార్కెట్లో దొరికే ఫుట్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో దుష్ర్పభావాలు చూపే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఐతే ఇంట్లో దొరికే పదార్ధలతో సులభంగా పాదాల ఆందాన్ని కాపాడుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు..
ఎలా ఉపయోగించాలంటే..
అలోవెరా జెల్‌లో బేకింగ్ పౌడర్, ఉప్పు కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంతో పాదాలను స్క్రబ్ చేసుకోవాలి.
ఈ విధంగా పాదాలను 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లలో పాదాలను నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత పాదాలను టవల్‌తో తుడిచి, కొబ్బరి నూనెతో తేలికగా మసాజ్ చేసుకోవాలి.
ఈ విధంగా పాదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుంటే పాదాల నలుపు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
ఇలా చేయడం వల్ల ద్వారా పాదాలపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
ఐతే బేకింగ్ సోడాలో పాదాలను ఎక్కువసేపు ఉంచితే దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది.
పాదాల చర్మం మృదువుగా మారి, మెరుస్తూ ఉంటుంది. చర్మంపై మచ్చలు ఉంటే తగ్గిపోతాయి.
పాదాలకు ఏవైనా గాయాలున్నా ఈ టిప్స్ ఫాలో అవ్వకూడదు.