BCPL Recruitment: బీసీపీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ. 70వేలకుపైగా జీతం పొందే అవకాశం..

|

Dec 08, 2021 | 2:16 PM

BCPL Recruitment: బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌ (బీసీపీఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయనున్నారు...

BCPL Recruitment: బీసీపీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ. 70వేలకుపైగా జీతం పొందే అవకాశం..
Bcpl
Follow us on

BCPL Recruitment: బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌ (బీసీపీఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా అప్లై చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలు ఉన్నాయి.

* వీటిలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి.

* ఎఫ్‌అండ్‌ఏ, లా, హెచ్‌ఆర్‌, కెమికల్‌, మెకానికల్‌, మార్కెటింగ్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌, ఆన్‌స్ట్రూమెంటేషన్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ/ ఎంఎంఎస్‌, బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత పొందాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 నుంచి 51 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారం ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,900 నుంచి రూ. 73,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 13-12-2021న ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 12-01-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Indian Origin Spinners: భారత్‌లో జన్మించి, టీమిండియాకే చుక్కలు చూపించారు.. విదేశాల్లో కీలక ప్లేయర్లుగా రాణిస్తోన్న స్పిన్నర్లు..!

Ashes 2021: 85 ఏళ్ల తరువాత తొలి బంతికే వికెట్.. యాషెస్ చరిత్రలో నాలుగో సారి.. ఇంగ్లండ్‌కు సొంతమైన 23 ఏళ్ల చెత్త రికార్డు..!

Drunk Driving: నల్లటి రోడ్లపై నెత్తుటి ఏర్లను పారిస్తోన్న యమ డ్రింకరులు.. నిండు ప్రాణాలు బలిగొంటూ..