ఈ నెల 17న బీసీసీఐ కీలక నిర్ణయం.?

దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది. యాక్టివ్ కేసుల కంటే రికవరీ శాతం పెరుగుతోంది. ఈ క్రమంలో భారత్‌లో మళ్లీ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తోంది.

ఈ నెల 17న బీసీసీఐ కీలక నిర్ణయం.?

Updated on: Oct 11, 2020 | 3:51 PM

BCCI Meeting: దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది. యాక్టివ్ కేసుల కంటే రికవరీ శాతం పెరుగుతోంది. ఈ క్రమంలో భారత్‌లో మళ్లీ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తోంది. అంతేకాకుండా త్వరలో జరగనున్న సిరీస్‌ల విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 17వ తేదీన జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ఈ ఏడాది చివరిలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్, వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు ఇండియా ఆతిధ్యం ఇవ్వడంతో పాటు, దేశవాళీ క్రికెట్ పునరుద్ధరణపై ఈ సమావేశంలో బీసీసీఐ చర్చించనుంది. బయో బబుల్ వాతావరణంలోనే దేశంలో డొమెస్టిక్ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తోంది. అలాగే ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్ల రెండు వారాల క్వారంటైన్‌పై క్రికెట్ ఆస్ట్రేలియాతో బీసీసీఐ బాస్ పలు చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read:

మ్యాక్స్‌వెల్.. ఎక్కడ నీ మ్యాడ్‌నెస్‌..!

సీఎస్‌కే ఓటమి.. జీవా ధోనిపై అసభ్యకర వ్యాఖ్యలు..