Bandla Ganesh: ‘స్పీచ్‌లు అదుర్స్.. కానీ ఈ స‌స్పెన్స్ ఏంటి’.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో హైడ్‌ అండ్ సీక్ గేమ్ ఆడుతోన్న బండ్ల‌

ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌ మళ్లీ ప్లేటు ఫిరాయించేస్తారా..? పవర్‌స్టార్ ఫ్యాన్స్‌తో తానాడుతున్న స్వీట్ గేమ్స్‌లో మరో మెలిక పెట్టడానికి రెడీ అయ్యారా..? పవన్‌ క్యాంప్‌కే కాదు..

Bandla Ganesh: స్పీచ్‌లు అదుర్స్.. కానీ ఈ స‌స్పెన్స్ ఏంటి.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో హైడ్‌ అండ్ సీక్ గేమ్ ఆడుతోన్న బండ్ల‌
bandla pawan

Updated on: Jun 02, 2021 | 7:55 AM

ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌ మళ్లీ ప్లేటు ఫిరాయించేస్తారా..? పవర్‌స్టార్ ఫ్యాన్స్‌తో తానాడుతున్న స్వీట్ గేమ్స్‌లో మరో మెలిక పెట్టడానికి రెడీ అయ్యారా..? పవన్‌ క్యాంప్‌కే కాదు.. యావరేజ్ ఫిలిమ్‌ లవర్స్ అందరి మెదళ్లకూ మేత పెట్టే బండ్ల.. ఈసారి కొత్తగా ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కనిపించే దేవుడు పవన్‌కల్యాణ్‌ అంటూ స్టేజ్‌నెక్కిన ప్రతిసారీ స్పీచ్‌తో దంచికొట్టే బండ్ల గణేశ్.. పీకే ఫ్యాన్స్‌ని మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నారు. తమ హీరోని అంతలా అభిమానించే ప్రొడ్యూసర్‌నుంచి మరో మూవీ వస్తే చూడాలన్నది పవన్ అభిమానుల ఆశ. బండ్ల కూడా వాళ్ల థాట్‌ప్రాసెస్‌తో సింక్ అవుతూనే వున్నారు. కానీ.. కండిషన్స్ అప్లయ్ అంటూ ప్రతిసారీ మెలిక పడుతోందక్కడ. నా దేవుడు కరుణించాడు… నా కలలు మళ్లీ నిజమవుతున్నాయి.. పవన్‌తో మరో సినిమా వస్తోంది అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసి చాలా రోజులే అయింది. కానీ… ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరన్నది మాత్రం రివీల్ చెయ్యలేదు. ఇవ్వాళ్టివరకూ హైడ్‌ అండ్ సీక్ ఆడుతూనే వున్నారు. పవన్‌ కెరీర్‌లో థర్టీయత్ మూవీ బండ్ల ప్రొడక్షన్‌లోనే వస్తోందని… కథాచర్చలు జరుగుతున్నాయని బలమైన వార్తలొచ్చాయి. . గతంలో పవన్‌తో తీన్‌మార్, గబ్బర్‌సింగ్‌ మూవీస్ చేశారు బండ్ల.

హరీష్‌శంకర్‌కీ బండ్లకూ దూరం పెరిగిందన్న వార్తలతో.. వాళ్లిద్దరూ కలిసి పని చేయరని తేలిపోయింది. మరి.. పవన్‌-బండ్ల మూవీని లీడ్ చేసే కెప్టెన్ ఎవరు? మొదట్లో పూరి జగన్నాథ్‌ అన్నారు.. తర్వాత ప్రభుదేవాతో టచ్‌లో వున్నా అన్నారు.. రీసెంట్‌గా రమేష్ వర్మ చెప్పిన కథను బండ్ల ఓకే చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ.. అవన్నీ రూమర్లే నమ్మొద్దు.. అని తానే కొట్టిపారేశారు. ఇంతకీ బండ్ల గుడ్ లుక్స్‌లో వుండే కెప్టెన్ ఎవరై ఉంటారన్న ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. అటు పవన్‌ కూడా.. బండ్ల మేటర్‌పై మౌనంగానే వున్నారు.

Also Read:  జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అనాథ పిల్ల‌ల‌కు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం

బ్రతికితే డేంజరస్ గానే బ్రతకాలి అంటున్న పూరి జగన్నాద్.. ( వీడియో )

Follow Us