
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. జాహూ, మష్కయ్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ సంచరిస్తుండగా వారిపై దాడికి దిగింది. ఈ ఘటనలో ఏడుగురు పాక్ సైనికులు హతమయ్యారు. ఆ విషయాన్ని బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ వెల్లడించింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తమకు స్వతంత్ర్య బలూచిస్థాన్ ఏర్పడే వరకు పాక్‌పై దాడులు కొనసాగుతాయని.. బలూచ్ నేతలు ఓ వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇంతకు ముందు కూడా పాక్‌లోని పలు నగరాల్లో దాడులకు దిగారు. కరాచీ స్టాక్ మార్కెట్‌పై కూడా దాడి జరిపింది బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా బలూచ్ లిబరేషన్ దాడులకు దిగింది. ఇటీవల పాక్,చైనాల మధ్య జరుగుతున్న ఒప్పందాలపై కూడా బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ నేత గ్వర్హమ్ బలూచ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ భూభాగాన్ని పాక్ చైనా చేతిలో పెడుతుందని మండిపడ్డారు.
Read More
కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తైవాన్ మాజీ అధ్యక్షుడు ఇక లేరు