
Balakrishna Donation: టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన నియోజకవర్గంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏర్పాటైన కోవిడ్ కేర్ సెంటర్‌కు రూ. 55 లక్షల విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ నివారణకు కావాల్సిన మందులు, పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతరత్రా పరికరాలను అందించనున్నారు. బాలకృష్ణ తన నియోజకవర్గంలోని పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. పీపీఈ కిట్లు, మాస్కులు, కోవిడ్ పేషెంట్స్ ల విషయంలో ఎప్పటికప్పుడు వైద్యులను అలెర్ట్ చేస్తూ వచ్చారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ గతంలో సినీ కుటుంబాలను ఆదుకునేందుకు ‘సీసీసీ మనకోసం’కు భారీగా విరాళం ఇవ్వడమే కాకుండా.. లాక్ డౌన్ సమయంలో ఎన్నో సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఇక ఇలాంటి క్లిష్ట సమయంలో బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
Natasimha #NandamuriBalakrishna will be donating Medicines, PPE kits, Masks and equipment worth 55 lakhs to COVID Center at Government Hospital in Hindupur pic.twitter.com/iRQv90W8o3
— BARaju (@baraju_SuperHit) August 23, 2020