హిందూపురంను జిల్లాగా మార్చండి: బాలకృష్ణ డిమాండ్

| Edited By: Srinu

Jun 27, 2019 | 7:48 PM

అనంతపురం జిల్లా హిందూపురంను జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. నియోజకవర్గంలో మూడురోజులు పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన లేపాక్షిలో విద్యార్ధులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హిందూపురంను జిల్లాగా మార్చాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మైక్ కట్ అవడంతో అసహనం వ్యక్తం చేసిన బాలయ్య ..తనదైన […]

హిందూపురంను జిల్లాగా మార్చండి: బాలకృష్ణ డిమాండ్
Follow us on

అనంతపురం జిల్లా హిందూపురంను జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. నియోజకవర్గంలో మూడురోజులు పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన లేపాక్షిలో విద్యార్ధులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హిందూపురంను జిల్లాగా మార్చాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

ఇదిలా ఉంటే సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మైక్ కట్ అవడంతో అసహనం వ్యక్తం చేసిన బాలయ్య ..తనదైన శైలిలో స్పందిస్తూ ఇదీ ప్రభుత్వ పాలనా తీరు అంటూ మండిపడ్డారు. ఇప్పటికే విద్యుత్ కోతలు, వేరుశనగరైతుల కష్టాలు ప్రారంభమయ్యాయని ఎద్దేవా చేసారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా స్ధానికంగా ఉన్న సమస్యల్ని అడిగితెలుసుకుంటూ చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు రాయలసీమ అభివృద్దికి పాటు పడతానని ఆయన హామీ ఇచ్చారు.