బదాయూ ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం..

|

Jan 07, 2021 | 4:27 PM

బదాయూ దారుణ ఘటనగా అభివర్ణించిన సీఎం యోగి తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని బరేలీ జోన్ అదనపు డీజీపీని సీఎం ఆదేశించారు.

బదాయూ ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం..
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బాధితురాలి కుటుంబానికి యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండగా నిలిచారు. బదాయూ దారుణ ఘటనగా అభివర్ణించిన సీఎం యోగి తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని బరేలీ జోన్ అదనపు డీజీపీని సీఎం ఆదేశించారు. బాధితురాలికి రాణి లక్ష్మీబాయి యోజన ప్రభుత్వ పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తులో అదనపు డీజీపీకి సహకరించాలని యూపీ స్పెషల్ టాస్కుఫోర్సును సీఎం సూచించారు. బదాయూ కేసులో పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.25వేల రివార్డు ఇస్తామని బదాయూ జిల్లా ఎస్పీ సంకల్పు‌ శర్మ ఇప్పటికే ప్రకటించారు.

కాగా, బదాయూ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు ఉఘైటి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని తేలింది. బాధితుల ఫిర్యాదును ఎస్ఐ రవేంద్ర ప్రతాప్ సింగ్ పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆలయానికి వెళ్లిన మహిళపై నిందితులు లైంగికదాడికి పాల్పడి, హత్య చేశారు. మృతదేహం దొరికిన 18 గంటల తర్వాత పోస్టుమార్టం నివేదిక తర్వాత పోలీసులు స్పందించారు. మరోవైపు, ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ యూపీ పోలీసులను ఆదేశించింది. ఈ మేర జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ యూపీ డీజీపీకి లేఖ రాశారు.