శత్రువులకు ఇవ్వడం ఇష్టం లేక తమ ఇళ్లను తామే తగులబెట్టుకున్నారు…!

|

Nov 17, 2020 | 4:30 PM

అజర్‌బైజాన్‌, ఆర్మేనియా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే కదా! పరస్పరం దాడులు చేసుకున్న రెండు దేశాలు యుద్ధ విరమణ సంధి చేసుకున్నాయి కదా! దీని ప్రకారం..

శత్రువులకు ఇవ్వడం ఇష్టం లేక తమ ఇళ్లను తామే తగులబెట్టుకున్నారు...!
Follow us on

అజర్‌బైజాన్‌, ఆర్మేనియా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే కదా! పరస్పరం దాడులు చేసుకున్న రెండు దేశాలు యుద్ధ విరమణ సంధి చేసుకున్నాయి కదా! దీని ప్రకారం నాగర్నో-కారాబాఖ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి ఆర్మేనియాకు చెందిన భద్రతా బలగాలు ఖాళీ చేయాలి.. అదలా ఉంచితే నాగర్నో-కారాబాఖ్‌లోని కల్బజార్‌ ప్రాంతం 1994 నుంచి ఆర్మేనియా సైనికుల ఆధీనంలోనే ఉంది.. ఇప్పుడు కల్బజార్‌ రీజియన్‌ అజర్‌బైజాన్‌ అధీనంలోకి వచ్చింది.. ఈ కారణంగా కల్బజార్‌లో ఉన్నవారు ఆ ప్రాంతాన్ని వదిలి ఆర్మేనియాకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఊరు వదిలి వెళ్లపోయేటప్పుడు వారు ఊరికే వెళ్లలేదు.. తమ ఇళ్లను వారే తగులబెట్టుకున్నారు.. అందుకు కారణం ప్రభుత్వం తమను బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తుందన్న కోపమే! దాంతో పాటుగా తాము ఇళ్లను వదిలేసి వెళితే అందులో అజర్‌బైజాన్‌ వారు వచ్చి చేరతారని, అది తమకు ఇష్టం లేదని అంటున్నారు.. తమ ఇళ్లను శత్రువులకు వదిలి వెళ్లడానికి తమకు చేతులు రావడం లేదని, అందుకే తగులబెట్టామని చెబుతున్నారు కల్బజార్‌ ప్రజలు..