అయోధ్యపురంలో దీపోత్సవం

|

Aug 04, 2020 | 11:14 PM

అయోధ్య భవ్య రామాలయ భూమిపూజకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిఉంది. అయోధ్యలో దీపోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భూమిపూజ సందర్భంగా అయోధ్యతో పాటు ఇతర నగరాల్లో కూడా ప్రజలు దీపాలు వెలిగించి ఉత్సవాలు జరుపుకోవాలని ఆలయ ట్రస్ట్‌ పిలుపునిచ్చింది. సాకేత నగరాన్ని కూడా మట్టి ప్రమిదలతో అలంకరించారు. దివ్వెల వెలుగులో పవిత్ర అయోధ్య నగరం వెలిగిపోతోంది. ఆలయాలు , ఇతర ప్రాంతాల్లో కూడా దీపాలను వెలిగించారు. అయోధ్య లోని సరయూ నదితీరం దీపకాంతులతో మెరిపోతోంది. సాధువులు, సంతువులు హారతి […]

అయోధ్యపురంలో దీపోత్సవం
Follow us on

అయోధ్య భవ్య రామాలయ భూమిపూజకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిఉంది. అయోధ్యలో దీపోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భూమిపూజ సందర్భంగా అయోధ్యతో పాటు ఇతర నగరాల్లో కూడా ప్రజలు దీపాలు వెలిగించి ఉత్సవాలు జరుపుకోవాలని ఆలయ ట్రస్ట్‌ పిలుపునిచ్చింది. సాకేత నగరాన్ని కూడా మట్టి ప్రమిదలతో అలంకరించారు. దివ్వెల వెలుగులో పవిత్ర అయోధ్య నగరం వెలిగిపోతోంది. ఆలయాలు , ఇతర ప్రాంతాల్లో కూడా దీపాలను వెలిగించారు. అయోధ్య లోని సరయూ నదితీరం దీపకాంతులతో మెరిపోతోంది. సాధువులు, సంతువులు హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతిరోజు సరయూ తీరంలో హారతి ఇస్తారు. కాని ఇవాళ హారతి కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది.

యూపీ సీఎం యోగి స్వయంగా భూమిపూజ సందర్భంగా దీపోత్సవ్‌లో పాల్గొన్నారు. లక్నోలోని తన నివాసం ముందు దీపాలను వెలిగించి ఉత్సవాల్లో పాల్గొన్నారు యోగి. దేశ ప్రజలకు ఇది ఒక పర్వదినమని అన్నారు యోగి. దీపావళి అనగానే అయోధ్య గుర్తుకురావాలని అన్నారు. తన నివాసం ముందు టపాసులు కూడ కాల్చారు యోగి.