భారతదేశంలో భానుడి ప్రతాపం..!

| Edited By: Anil kumar poka

Jun 04, 2019 | 11:53 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కాస్త తగ్గుముఖం పడ్డాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం భానుడి తీవ్రత కొనసాగుతోంది. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజాగా.. తెలంగాణాలో అత్యధికంగా 43, ఏపీలో 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ, ఆరోగ్య శాఖ కలిసి ప్రజలకు కొన్ని సలహాను ప్రకటించారు. ఈ సమయంలో వదులుగా, తేలికపాటి రంగు […]

భారతదేశంలో భానుడి ప్రతాపం..!
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కాస్త తగ్గుముఖం పడ్డాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం భానుడి తీవ్రత కొనసాగుతోంది. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజాగా.. తెలంగాణాలో అత్యధికంగా 43, ఏపీలో 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ, ఆరోగ్య శాఖ కలిసి ప్రజలకు కొన్ని సలహాను ప్రకటించారు. ఈ సమయంలో వదులుగా, తేలికపాటి రంగు దుస్తులను ధరించాలని, టీ, కాఫీలను ఎక్కువగా తాగరాదని తెలిపాయి.

మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని, వెళ్లిన గొడుగు, టోపీని ధరించాలని ప్రజలను కోరారు. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మ, నారింజ వంటి పండ్లు తరుచుగా తీసుకోవాలని సూచించారు. కాగా.. గత కొన్ని రోజులుగా రాజస్థాన్‌లోని చురు ప్రదేశంలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. తాజాగా సోమవారం కడా చురులో 50.06 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే.. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో హీట్వేవ్ పరిస్థితులు నమోదవుతున్నాయి.