ఈ ఆదివారం..దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ…

|

Mar 19, 2020 | 10:26 PM

చైనాలోని వూహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. వేల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ.. మృత్యునాదం చేస్తోంది. మహమ్మారి వైరస్ రోజురోజుకూ విస్తరిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్టయి యుద్ద ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాయి. తాజాగా దీనిపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం మొదటి ప్రపంచ యుద్దం నాటి పరిస్థితులు ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం మానవజాతే ప్రమాదపు అంచున […]

ఈ ఆదివారం..దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ...
Follow us on

చైనాలోని వూహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. వేల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ.. మృత్యునాదం చేస్తోంది. మహమ్మారి వైరస్ రోజురోజుకూ విస్తరిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్టయి యుద్ద ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాయి. తాజాగా దీనిపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం మొదటి ప్రపంచ యుద్దం నాటి పరిస్థితులు ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం మానవజాతే ప్రమాదపు అంచున ఉందన్న ప్రధాని, ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు ఎప్పట్నుంచే ప్రయత్నిస్తున్నా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని తెలిపారు. అప్రమత్తంగా ఉండి..జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ నుంచి సురక్షితంగా భయటపడొచ్చని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటే…ప్రపంచం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు మోదీ.

ఈనెల 22వ తేదీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ పాటిద్దామని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఆరోజున ఉదయం 7 గంటలనుంచి రాత్రం 9గంటల వరకు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ఆయన కోరారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఒకటికి, రెండు సార్లు ఆలోచించాలని తెలిపారు. పరిస్థితులు మరింత ముదిరితే జనతా కర్ఫ్యూ ఓ ప్రిపరేషన్‌లా ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు కావాల్సిన వస్తువులను ఇళ్లకే చేరవేస్తామని చెప్పిన మోదీ, ఆదివారం తరువాత కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. దేశవ్యాప్తంగా స్వయం ప్రకటిత కర్ఫ్యూ ఉండాలని ప్రధాని వెల్లడించారు.