హూస్టన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

|

Sep 22, 2019 | 11:39 AM

ప్రధాని మోదీ శనివారం టెక్సాస్ లోని హూస్టన్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్, ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టర్ క్రిస్టోఫర్ ఓల్సన్, ఇండియాకు అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్, తదితరులు ఘన స్వాగతం పలికారు. హౌడీమోడీ ఈవెంట్ కు హాజరయ్యేందుకు వఛ్చిన ఆయనకు ఇంకా స్వాగతం పలికినవారిలో ఇతర భారతీయ, అమెరికన్ అధికారులు కూడా ఉన్నారు. తనకు వెల్కమ్ చెబుతుండగా అధికారులను గ్రీట్ చేస్తూ మోదీ వెళ్తున్నప్పుడు ఓ పూల బొకే […]

హూస్టన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
Follow us on

ప్రధాని మోదీ శనివారం టెక్సాస్ లోని హూస్టన్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్, ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టర్ క్రిస్టోఫర్ ఓల్సన్, ఇండియాకు అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్, తదితరులు ఘన స్వాగతం పలికారు. హౌడీమోడీ ఈవెంట్ కు హాజరయ్యేందుకు వఛ్చిన ఆయనకు ఇంకా స్వాగతం పలికినవారిలో ఇతర భారతీయ, అమెరికన్ అధికారులు కూడా ఉన్నారు. తనకు వెల్కమ్ చెబుతుండగా అధికారులను గ్రీట్ చేస్తూ మోదీ వెళ్తున్నప్పుడు ఓ పూల బొకే లోని పూలు కింద కార్పెట్ పై పడగా వాటిని ఆయన వంగి తీసుకుని తన సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి ఇవ్వడం విశేషం. ఈ ‘ గెస్చర్ ‘ ని యూజర్లు సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. పైగా ఈ వీడియో కూడా వైరల్ అయింది. . అతి చిన్న విషయాలను సైతం మోదీ ఎంతగా పట్టించుకుంటారో దీన్ని బట్టి అర్థమవుతోందని యూజర్లు మోడీని ఆకాశానికి ఎత్తేశారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఏడు గంటలకు జరగనున్న ‘ హౌడీ మోడీ ‘ ఈవెంట్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనతో ఒకే వేదికను పంచుకోనున్నారు. 50 వేలమందికి పైగా ఇండియన్ అమెరికన్లు హాజరయ్యే ఈ కార్యక్రమంలో అమెరికాలోని పలువురు డెమొక్రాట్ ఎంపీలు కూడా పాల్గొననున్నారు. హూస్టన్ లో దిగగానే మోదీ .. ‘ ఈ డైనమిక్, ఎనర్జిటిక్ సిటీలో ఈ రోజు, రేపు జరిగే విస్తృత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తహతహలాడుతున్నాను ‘ అని ట్వీట్ చేశారు.
ఆ తరువాత ఆయన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇంధన రంగంలో అత్యంత ప్రముఖులైన సీఈఓ లను కలుసుకున్నారు. ఈ రంగంలో భారత, అమెరికా దేశాల మధ్య పరస్పర పెట్టుబడుల అవకాశాలను ఆయన సమీక్షించారు. హౌడీమోడీ ఈవెంట్ లో సుమారు 400 మంది ఆర్టిస్టులు పాల్గొని ఉభయ దేశాల రీతులను ప్రతిబించే కార్యక్రమాలతో అలరించనున్నారు. కాగా-న్యూయార్క్ లో జరిగే క్లైమేట్ సమ్మిట్ లో మోడీ పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించనున్నారు.