దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ జైలులో 220 మందికి పైగా ఖైదీలకు కరోనా పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. గత వారంలో జిల్లా జైలులో మొత్తం 224 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం 706 మంది ఖైదీలలో దాదాపు మూడోవంతు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే అని అధికారులు చెబుతున్నారు.
Read More:
అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!