ఆస్ట్రాజెనికా,ఆక్స్ ఫర్డ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇండియా ఆమోదం తెలపవచ్చు. వచ్ఛే వారమే ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛే అవకాశాలున్నాయి. భారత రెగ్యులేటరీ కోరిన అదనపు డేటాను పూణే లోని సీరం కంపెనీ సమర్పించడంతో ఇందుకు మార్గం సుగమమైంది. ఈ టీకామందు రెగ్యులేటరీ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చిన మొదటి దేశం ఇండియాయే అయింది. ఫైజర్,లోకల్ భారత్ బయో టెక్ సంస్థలు తయారు చేసిన టీకామందులను వచ్ఛే నెలలో అత్యవసరంగా వినియోగించాలని , ఆ నెల నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ఇండియా యోచిస్తోంది. తక్కువ ఆదాయం గల దేశాలకు,ఉష్ణ దేశాలకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వరప్రదాయిని అంటున్నారు. చౌక అయిన ఈ టీకామందును సులభంగా ట్రాన్స్ పోర్ట్ చేయవచ్చు..పైగా సాధారణ ఉష్ణోగ్రత గల ఫ్రిజ్ లోనూ ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని భావిస్తున్నారు.
ఏమైనా వ్యాక్సిన్ల వినియోగంతో కరోనా వైరస్ ను చాలావరకు అదుపు చేయవచ్చునని అంటున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గింది. రికవరీ రేటు పెరిగింది.