మణిపూర్‌లో రూ.2.14 కోట్ల విలువైన బ్రౌన్‌షుగర్‌ పట్టివేత

|

Sep 15, 2020 | 7:07 PM

భారీ మొత్తంలో బ్రౌన్‌షుగర్‌ను పట్టుబడింది. మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న కిలో బ్రౌన్‌ షుగర్‌ను అస్సాం రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

మణిపూర్‌లో రూ.2.14 కోట్ల విలువైన బ్రౌన్‌షుగర్‌ పట్టివేత
Follow us on

భారీ మొత్తంలో బ్రౌన్‌షుగర్‌ను పట్టుబడింది. మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న కిలో బ్రౌన్‌ షుగర్‌ను అస్సాం రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులోని ఖూడెంగ్తాబి గ్రామం వద్ద అస్సాం రైఫిల్స్‌ తనిఖీలు చేపట్టారు. అయితే, అనుమానాస్పదంగా వెళ్తున్న కారును నిలిపి పరిశీలించారు. అందులో అక్రమంగా తరలిస్తున్న బ్రౌన్‌ షుగర్‌ కనిపించడంతో స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.2.14 కోట్లకు పైగా ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. మోరే నుంచి ఇంఫాల్‌కు బ్రౌన్‌ షుగర్‌ను తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. కారుతోపాటు బ్రౌన్‌ షుగర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కోసం మోరే పోలీసులకు అప్పగించామని అస్సాం రైఫిల్స్ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.