
అసోంలో కరోనా మరణం లేని రోజుగా ఈ రోజు రికార్డు అయ్యింది. అసోంలో బుధవారం తొలిసారి ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అయితే తాజాగా మరో 380 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,07,741కి చేరిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. కాగా ఇవాళ మరో 655 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 1,98,694కి చేరింది.
Assam reports 380 new #COVID19 cases and 655 discharges today.
Total cases in the State rise to 2,07,741, including 1,98,694 discharges and 934 deaths. Active cases at 8,110: State Health Minister Himanta Biswa Sarma pic.twitter.com/EiCfXbb4gK
— ANI (@ANI) November 4, 2020
రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 95.64 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 8,110 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు. ‘‘అందరికీ శుభవార్త..! దాదాపు 115 రోజుల పాటు అసోంలో వరుసగా కరోనా పేషెంట్లు చనిపోతున్న బాధాకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ ఇన్నాళ్లకు ఇవాళ ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని తెలిపేందుకు సంతోషిస్తున్నాను..’’ అని శర్మ ట్వీట్ చేశారు. ప్రజలంతా ఇకపైనా అప్రమత్తంగా ఉండాలనీ.. ఈ మహమ్మారికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.