“మీ బ్యాంకులను అడగండి” విజయ్ మాల్యా ట్వీట్

| Edited By:

Jul 14, 2019 | 12:25 PM

భారతీయ బ్యాంకులకు టోకరా ఇచ్చి విదేశాల్లో విలాసంగా గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిపై మండిపడ్డారు. ఏడాది కాలంగా తాను తీసుకున్న రుణాన్ని నూటికి నూరుశాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నా బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదో బ్యాంకులను అడగండి అంటూ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. తనను అంతా దొంగ అంటున్నారని.. నేను తిరిగి ఇస్తానంటున్నా బ్యాంకులు తాత్సరం చేస్తున్నాయని స్పష్టం చేశారు. […]

మీ బ్యాంకులను అడగండి  విజయ్ మాల్యా ట్వీట్
Follow us on

భారతీయ బ్యాంకులకు టోకరా ఇచ్చి విదేశాల్లో విలాసంగా గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిపై మండిపడ్డారు. ఏడాది కాలంగా తాను తీసుకున్న రుణాన్ని నూటికి నూరుశాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నా బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదో బ్యాంకులను అడగండి అంటూ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. తనను అంతా దొంగ అంటున్నారని.. నేను తిరిగి ఇస్తానంటున్నా బ్యాంకులు తాత్సరం చేస్తున్నాయని స్పష్టం చేశారు.

అసలు విషయం ఏమిటంటే ఇంగ్లాండ్‌లో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన మాల్యా, వెస్టిండీస్ క్రీడాకారుడు క్రిస్ గేల్‌ ఇద్దరూ కలిసి ఫోటో దిగారు. దీన్ని గేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బిగ్‌బాస్‌ మాల్యాతో ఫోటో దిగడం గొప్పగా ఫీలవుతున్నాననే క్యాప్షన్ దానికి జతచేశాడు గేల్. దీంతో ఇండియన్ నెటిజన్లు గేల్ పోస్ట్‌పై మండిపడుతున్నారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తిరుగుతున్న విజయ్‌మాల్యాను బిగ్‌బాస్ అంటావేమిటి? అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై విజయ్ మాల్యా రియాక్ట్ అవుతూ ట్విట్టర్‌లో ఇలా స్పందించారు .