లాక్‌డౌన్‌తో.. ప్రపంచం శుభ్రంగా.. అడవులు అందంగా..

| Edited By:

Apr 22, 2020 | 10:44 PM

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే దీని వల్ల ప్రకృతికి కాస్త మేల్కొలుపు లభించింది.

లాక్‌డౌన్‌తో.. ప్రపంచం శుభ్రంగా.. అడవులు అందంగా..
Follow us on

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే దీని వల్ల ప్రకృతికి కాస్త మేల్కొలుపు లభించింది. గతంలో కంటే ప్రస్తుతం అడవులు మరింత పచ్చగా కనిపస్తున్నాయి. ఇక నగరాలు, పట్టణాలయితే కాలుష్యరహితంగా శుభ్రంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరమైన ఢిల్లీ నగరంలో కాలుష్యం చాలా వరకు తగ్గడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

కాగా.. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నైట్రోజన్ డయోక్సైడ్ కాలుష్యం 30 శాతం తగ్గిందట. ఇక ప్రఖ్యాత నగరం రోమ్‌లో అయితే ఒక్క నెలలోనే (మార్చి నుంచి ఏప్రిల్ వరకు) 49 శాతం మేర కాలుష్యం తగ్గిందట. దీంతో ఆకాశంలోని నక్షత్రాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రోమ్స్‌ చెప్పుకుంటున్నారు. అడవులు కూడా పచ్చగా ప్రశాంతంగా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. జంతువులు కూడా నిర్భయంగా రోడ్లపైకి వస్తున్నాయని, గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు.

Also Read: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా