ఇకపై బిగ్ బాస్‌లో రాజకీయ కురుక్షేత్రం…

ప్రతిపక్షాలు.. ఈ మాట రాజకీయాల్లో ఎక్కువగా వింటుంటాం. వీరందరూ కూడా అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపుతూ అసెంబ్లీ సాక్షిగా తీవ్ర విమర్శలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ మాట ‘బిగ్ బాస్’లో కూడా వినిపించనుంది. మీరు వినేది నిజమేనండీ బాబు.. హిందీ బిగ్ బాస్‌లో మొట్టమొదటి సారిగా ప్రత్యర్థి కెప్టెన్‌ను ఎంపిక చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 13 కంటెస్టెంట్ల మధ్య అవసరం లేని యుద్దాలతో […]

ఇకపై బిగ్ బాస్‌లో రాజకీయ కురుక్షేత్రం...

Updated on: Dec 23, 2019 | 4:40 PM

ప్రతిపక్షాలు.. ఈ మాట రాజకీయాల్లో ఎక్కువగా వింటుంటాం. వీరందరూ కూడా అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపుతూ అసెంబ్లీ సాక్షిగా తీవ్ర విమర్శలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ మాట ‘బిగ్ బాస్’లో కూడా వినిపించనుంది. మీరు వినేది నిజమేనండీ బాబు.. హిందీ బిగ్ బాస్‌లో మొట్టమొదటి సారిగా ప్రత్యర్థి కెప్టెన్‌ను ఎంపిక చేయడం జరిగింది.

సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 13 కంటెస్టెంట్ల మధ్య అవసరం లేని యుద్దాలతో రచ్చ రచ్చ అవుతోంది. ప్రతివారం సల్మాన్ ఎంత చెబుతున్నా.. హౌస్‌మేట్స్ తీరు మారకపోవడంతో అటు నిర్వాహకులకు.. ఇటు ఫ్యాన్స్‌కు తీవ్ర అసహనం కలుగుతోంది. శనివారం అసిమ్ రియాజ్, అర్హన్ ఖాన్, రష్మీ దేశాయ్, సిద్ధార్థ్ శుక్లాల మధ్య జరిగిన గొడవ తీవ్రస్థాయికి చేరిందనే చెప్పాలి.

ప్రేమలు, విరహాలు.. ఆపై గొడవలు.. ఇదే హిందీ బిగ్ బాస్‌లో ఆనవాయితీ. సిద్ధార్థ్- షెహనాజ్- పరాస్, మహీరా- పరాస్- షెహనాజ్, రష్మీ- అర్హన్- షెఫాలీ.. ఇలా ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ ఎక్కువైపోయాయి. ఇకపోతే సిద్ధార్థ్- రష్మీల వ్యవహారం అయితే పగ- ప్రేమలతో నిండిపోయింది.

తాజాగా సిద్ధార్థ్, రష్మీల మధ్య మొదలైన గొడవ తారాస్థాయికి చేరుకోవడమే కాకుండా మధ్యలో అర్హన్ ఖాన్ కూడా కలగజేసుకోవడంతో.. ఒకరిపై ఒకరు టీలు.. కాఫీలు కూడా పోసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ టాస్క్‌లో అసిమ్ రియాజ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక ఓడిపోయిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ స్పెషల్ పవర్స్ ఇచ్చారు.

విశాల్, అర్హన్, ఆర్తి సింగ్, మధురిమ, షెఫాలీలను.. అసిమ్ కన్నా కెప్టెన్‌గా మీరు కావడానికి ఎంతవరకు అర్హులని వారిని బిగ్ బాస్ ప్రశ్నించాడు. ఇలా ఒక్కొక్కరి వాదనా విన్న బిగ్ బాస్ చివరికి ఆర్తి సింగ్‌ను బిగ్ బాస్‌లో మొదటి ప్రత్యర్థి కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. దీనితో బిగ్ బాస్‌లో ఇకపై హౌస్‌లో సైతం రాజకీయ కురుక్షేత్రం మొదలైనట్లే.