అమ్మా..! సంక్రాంతికి వస్తాను.. వీర జవాన్ చెప్పిన చివరి మాటలు.. మంచు కొండల్లో అమరుడైన తెలుగు ముద్దుబిడ్డ ..

ఉష్ణోగ్రత దారుణంగా పడిపోవడంతో ఉత్తర భారతం విలవిలలాడుతోంది. ఈ ప్రభావం కాశ్మీర్‌పై పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డెప్పనాయుడు అనే జవాను...

అమ్మా..! సంక్రాంతికి వస్తాను.. వీర జవాన్ చెప్పిన చివరి మాటలు.. మంచు కొండల్లో అమరుడైన తెలుగు ముద్దుబిడ్డ ..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 03, 2021 | 1:58 PM

Army Jawan Reddeppa Naidu : చలి చంపేస్తోంది.. టెంపరేచర్ జీరోకు దగ్గరవుతోంది. దీంతో వాతావరణం గడ్డ కడుతోంది. ఉష్ణోగ్రత దారుణంగా పడిపోవడంతో ఉత్తర భారతం విలవిలలాడుతోంది. ఈ ప్రభావం కాశ్మీర్‌పై పడింది. దేశ సరిహద్దుల్లో చలి తీవ్రతకు చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ రెడ్డెప్పనాయుడు ప్రాణాలు కోల్పోయారు.

చంద్రగిరి మండలం గడ్డ కింద పల్లి కి చెందిన 38 ఏళ్ల రెడ్డప్ప నాయుడు మంచుకొండల్లో ప్రాణాలు విడిచారు. 14 ఏళ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో చేరిన రెడ్డప్ప.. గత కొన్ని రోజులుగా మంచు గడ్డల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. నిన్న చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం హెలికాప్టర్ లో ఆర్మీ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు సహచరులు.

ఈలోపే ప్రాణాలు కోల్పోయారు. సంక్రాంతికి సెలవుపై వస్తానన్న రెడ్డప్ప విగతజీవిగా వస్తుండడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రెడ్డప్ప నాయుడు.. నిత్యం దేశ రక్షణకు పరితపించారు.

రెడ్డెప్పనాయుడు, శాంతమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మంచు రెడ్డెప్పనాయుడు ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు పురుషోత్తం నాయుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఏటా సంక్రాంతి పండగకు ఇరువురూ స్వగ్రామానికి చేరుకొని కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడిపేవారు.