యూపీఏ హయాంలో కూడా సర్జికల్ దాడులు జరిగాయి : రిటైర్డ్ ఆర్మీ అధికారి

| Edited By:

May 05, 2019 | 12:58 PM

మోదీ హయాంలోనే కాదు యూపీఏ హయాంలో కూడా సర్జికల్ దాడులు జరిగాయని రిటైర్డ్ ఆర్మీ అధికారి జనరల్ డీఎస్ హుడా స్పష్టం చేశారు. ప్రధాని మోదీయే తొలి సారిగా సర్జికల్ స్ట్రైక్స్ చేయించారని బీజేపీ క్లెయిమ్ చేసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొన్న సైనికులలో తాను కూడా ఉన్నానని డీఎస్ హుడా చెప్పారు. సైనిక పరంగా సర్జికల్ దాడులు జరపాల్సిన అవసరం వచ్చిందని, కానీ బీజేపీ మాత్రం వాటికి అత్యధిక […]

యూపీఏ హయాంలో కూడా సర్జికల్ దాడులు జరిగాయి : రిటైర్డ్ ఆర్మీ అధికారి
Follow us on

మోదీ హయాంలోనే కాదు యూపీఏ హయాంలో కూడా సర్జికల్ దాడులు జరిగాయని రిటైర్డ్ ఆర్మీ అధికారి జనరల్ డీఎస్ హుడా స్పష్టం చేశారు. ప్రధాని మోదీయే తొలి సారిగా సర్జికల్ స్ట్రైక్స్ చేయించారని బీజేపీ క్లెయిమ్ చేసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొన్న సైనికులలో తాను కూడా ఉన్నానని డీఎస్ హుడా చెప్పారు. సైనిక పరంగా సర్జికల్ దాడులు జరపాల్సిన అవసరం వచ్చిందని, కానీ బీజేపీ మాత్రం వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయం చేసిందని హూడా పేర్కొన్నారు. 2004-2014 మధ్య కాలంలో ఆరు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, అయితే అప్పటి కాంగ్రెస్ సర్కార్ వీటిని తమ ఘనతగా ప్రచారం చేసుకోలేదని ఆయన వివరించారు. సైనిక చర్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం తగదని.. ఆర్మీని ఎన్నికల ప్రచారంలోనికి లాగడం సరికాదన్నారు.