వాస్తవాధీన రేఖలో పర్యటించనున్న ఆర్మీ చీఫ్

చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో క్షేత్రస్ధాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె పర్యటించనున్నారు. మంగళవారం లేహ్‌, కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలను ఆయన సందర్శించనున్నట్లు సమాచారం.

వాస్తవాధీన రేఖలో పర్యటించనున్న ఆర్మీ చీఫ్

Updated on: Jun 22, 2020 | 9:26 PM

చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో క్షేత్రస్ధాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె పర్యటించనున్నారు. మంగళవారం లేహ్‌, కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలను ఆయన సందర్శించనున్నట్లు సమాచారం. సోమవారం దేశ రాజధాని ఢిల్లిలో అందుబాటులో ఉన్న సైనికాధికారులు, కమాండర్లతో సహా ఉన్నత సైనికాధికారులతో భద్రత పరిస్థితిపై సమీక్షించారు ఆర్మీ చీఫ్.

గత వారం తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయకిలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో మంగళవారం జనరల్‌ నరవణే లేహ్‌ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో బలగాల సన్నద్ధతతో పాటు చైనా, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖల వెంబడి దళాల మోహరింపును ఆర్మీ చీఫ్‌ సమీక్షిస్తారు. తన పర్యటనలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోనున్నారు. మరోవైపు సరిహద్దు వివాద పరిష్కారానికి మోల్దో-చుసుల్‌ లోయలో ఇరు దేశాల కార్ప్స్‌ కమాండర్ల సమావేశం కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us