వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైకోర్టులో వాదనలు

| Edited By:

Mar 28, 2019 | 1:26 PM

వివేకానంద రెడ్డి హత్యకేసుపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం.. లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరపు వాదనలు విననుంది. కేసును సీబీఐకి అప్పగించాలని జగన్, సౌభాగ్యమ్మ తరపు న్యాయవాదులు కోరారు. అలాగే.. కేసును విచారిస్తున్న సిట్ ప్రెస్‌మీట్ పెట్టకుండా ఆదేశాలివ్వాలని విన్నవించారు. సిట్ విచారణ ద్వారా వివేకా కుటుంబసభ్యులే నిందితులు అన్నట్లుగా చూపి.. దాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఇక మధ్యాహ్నం.. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తారు […]

వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైకోర్టులో వాదనలు
Follow us on

వివేకానంద రెడ్డి హత్యకేసుపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం.. లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరపు వాదనలు విననుంది. కేసును సీబీఐకి అప్పగించాలని జగన్, సౌభాగ్యమ్మ తరపు న్యాయవాదులు కోరారు. అలాగే.. కేసును విచారిస్తున్న సిట్ ప్రెస్‌మీట్ పెట్టకుండా ఆదేశాలివ్వాలని విన్నవించారు. సిట్ విచారణ ద్వారా వివేకా కుటుంబసభ్యులే నిందితులు అన్నట్లుగా చూపి.. దాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఇక మధ్యాహ్నం.. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తారు అడ్వకేట్ జనరల్.