మాడు పగిలే ఎండలు.. 123 ఏళ్లలో 2వ సారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే నెలలోనూ వడపోతే !.. ఐఎండీ హెచ్చరిక

సగటు గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఏప్రిల్ నెలలో తూర్పు, ఈశాన్య భారతదేశంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 28.12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని మోహపాత్ర చెప్పారు. 1901 తర్వాత ఈ ప్రాంతాల్లో ఏప్రిల్‌లో ఇంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. 1980ల నుండి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా మారాయని వారు నివేదించారు.

మాడు పగిలే ఎండలు.. 123 ఏళ్లలో 2వ సారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే నెలలోనూ వడపోతే !.. ఐఎండీ హెచ్చరిక
Summer Weather
Follow us

|

Updated on: May 02, 2024 | 10:29 AM

Summer Weather: ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 1901 తర్వాత మొదటిసారిగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌ నెలలో వడగాలులు కొనసాగాయి. మే నెలలో కూడా విపరీతమైన ఎండలు, వేడి, వడగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. 11 రోజుల పాటు హీట్‌వేవ్స్‌ కొనసాగుతాయిన ఐఎండీ అంచనా వేసింది. అయితే ఇప్పటికే 2023 అత్యంత వేడి సంవత్సరంగా పరిగణించబడుతుంది.

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర మాట్లాడుతూ.. మే నెల వాతావరణ సూచనను విడుదల చేస్తూ ఈ సమాచారాన్ని అందించారు. ఏప్రిల్‌లో 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, ఆపై 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రత, వడగాలులు వీచినట్లు తెలిపారు. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఏప్రిల్ నెలలో తూర్పు, ఈశాన్య భారతదేశంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 28.12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని మోహపాత్ర చెప్పారు. 1901 తర్వాత ఈ ప్రాంతాల్లో ఏప్రిల్‌లో ఇంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. 1980ల నుండి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా మారాయని వారు నివేదించారు.

దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాలలో మేలో 8-11 రోజుల పాటు హీట్‌వేవ్స్‌ ఉండవచ్చని మహాపాత్ర చెప్పారు. రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఇంటీరియర్ ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలు 5-5 వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సాధారణంగా ఉత్తర భారతం, మధ్యభారతం, ద్వీపకల్ప భారత పరిసర ప్రాంతాల్లోని మైదాన ప్రాంతాల్లో దాదాపు మూడురోజుల పాటు వడగాలులుంటాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..