అధికారుల కోసం నిరీక్షణ ..మున్సిపల్ కార్యాలయం ముందు రాత్రంతా నిద్ర

అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం బయట ఎమ్మెల్యే నిమ్మల రాత్రంతా నిద్రపోయారు. ప్రజలు డెంగ్యూ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిమ్మల ఆరోపించారు. శుక్రవాం ఉదయం నుంచి అధికారులను ఇదే విషయంపై అడిగేందుకు ప్రయత్నించినా..  కనీసం ఆయనను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో నిమ్మల ఈ విధంగా […]

అధికారుల కోసం నిరీక్షణ ..మున్సిపల్ కార్యాలయం ముందు రాత్రంతా నిద్ర

Updated on: Oct 12, 2019 | 12:35 PM

అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు.
ప్రజా సమస్యలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం బయట ఎమ్మెల్యే నిమ్మల రాత్రంతా నిద్రపోయారు. ప్రజలు డెంగ్యూ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిమ్మల ఆరోపించారు. శుక్రవాం ఉదయం నుంచి అధికారులను ఇదే విషయంపై అడిగేందుకు ప్రయత్నించినా..  కనీసం ఆయనను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో నిమ్మల ఈ విధంగా నిరసనకు దిగారు. శుక్రవారం రాత్రంతా ఆరుబయట దోమలు కరుస్తున్నా ఎమ్మెల్యే నిమ్మల అలాగే నిద్రచేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us