ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? ఉపరాష్ట్రపతిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని , ఇది ఉన్నత పదవిలో ఉన్న ఆయనకు తగదన్నారు తమ్మినేని. రాజకీయాల్లో నైతిక విలువలుండాలని.. తాను అలాంటి పదవిలో ఉంటే ఖచ్చితంగా అలాంటి పని చేసేవాడిని కాదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఏ సభా నాయకుడికి ఉంటుందో ఆ సభలో బిల్లుపై చర్చ జరుగుతుందన్నారు. తాను అసెంబ్లీ నియమాలకు అనుగుణంగానే సభను నడిపిస్తున్నానని తెలిపారు తమ్మినేని. అసెంబ్లీలో జరిగే ప్రతి […]

ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? ఉపరాష్ట్రపతిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Edited By:

Updated on: Aug 04, 2019 | 2:37 PM

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని , ఇది ఉన్నత పదవిలో ఉన్న ఆయనకు తగదన్నారు తమ్మినేని. రాజకీయాల్లో నైతిక విలువలుండాలని.. తాను అలాంటి పదవిలో ఉంటే ఖచ్చితంగా అలాంటి పని చేసేవాడిని కాదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఏ సభా నాయకుడికి ఉంటుందో ఆ సభలో బిల్లుపై చర్చ జరుగుతుందన్నారు. తాను అసెంబ్లీ నియమాలకు అనుగుణంగానే సభను నడిపిస్తున్నానని తెలిపారు తమ్మినేని.

అసెంబ్లీలో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారని, శాసనసభ జరుగుతున్న సమయంలో మూడు టీవీ ఛానెళ్లు మీడియా పాయింట్ వద్ద లైవ్ పెట్టడం సరికాదన్నారు స్పీకర్ సీతారాం. తాజగా ఉపరాష్ట్రపతి వెంకయ్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.