ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి రంగం సిద్దం

ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి రంగం సిద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌

ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి రంగం సిద్దం

Edited By:

Updated on: Jul 01, 2020 | 2:04 PM

AP outsourcing services: ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి రంగం సిద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల కోసం ఆప్కోస్‌ ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్ సోర్సింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రారంభమైంది.

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేయనుంది. సెక్రటేరియట్ లో 26 శాఖలకు సంబంధించి 643 మంది నియామకం కానున్నారు. విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో 10,707 మంది నియామకం కానున్నారు. 13 జిల్లాల కలెక్టరేట్లలో 36,042 మందికి ప్లేస్‌మెంట్ ఇంటిమేషన్‌ లెటర్లు అందించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆప్కోస్‌ ద్వారానే ఉద్యోగుల నియామకం జరగనుంది.

Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..