అర్థరాత్రి ప్రకాశం బ్యారేజి నుంచి అవనిగడ్డ వరకు మంత్రి నాని పర్యటన

|

Oct 17, 2020 | 10:42 AM

ప్రకాశం బ్యారేజీ నుంచి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో అర్ధరాత్రి 11.30 నుంచి 2.00గంటల వరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం, బొబ్బర్లంక, అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక పునరావాస కేంద్రాల్లో ఉన్న గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 9 లక్షల 40,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు […]

అర్థరాత్రి ప్రకాశం బ్యారేజి నుంచి అవనిగడ్డ వరకు మంత్రి నాని పర్యటన
Follow us on

ప్రకాశం బ్యారేజీ నుంచి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో అర్ధరాత్రి 11.30 నుంచి 2.00గంటల వరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం, బొబ్బర్లంక, అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక పునరావాస కేంద్రాల్లో ఉన్న గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 9 లక్షల 40,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం బ్యారేజి నుంచి అవనిగడ్డ వరకు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని మంత్రి తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంతో పాటు పామర్రు, పెనమలూరు నియోజకవర్గంలో కూడా పర్యటించి అధికారులు అందర్నీ అప్రమత్తం చేశామని నాని చెప్పారు.

ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, వైద్య శాఖల అధికారులను మంత్రి నాని అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వరద ఉధృతి గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట, అవనిగడ్డ, మోపిదేవి ఎమ్మార్వోలు, అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమేశ్వర రవి కుమార్, ఎస్సై సురేష్, ఇరిగేషన్ డి.ఈ,ఏ.ఈ, పలు శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.