ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగవుతుంది.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్…

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ‌ నిమ్మగడ్డ రమేష్‌ లేఖ రాయడాన్ని మంత్రి కొడాలి నాని తీవ్రంగా తప్పుపట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగవుతుంది.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్...

Updated on: Dec 05, 2020 | 9:13 PM

Minister Kodali Nani Comments: ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ‌ నిమ్మగడ్డ రమేష్‌ లేఖ రాయడాన్ని మంత్రి కొడాలి నాని తీవ్రంగా తప్పుపట్టారు. ఫిబ్రవరి వరకే స్థానిక సంస్థల గడువు ఐదేళ్లు పూర్తయిందని.. అప్పుడెందుకు ఎన్నికలు నిర్వహించలేదని నిలదీశారు. చంద్రబాబు ఏది చెబితే అది చేసే వ్యక్తి నిమ్మగడ్డ అంటూ విరుచుకుపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం పంచాయతీల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ అలా జరగకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీకి సవాల్‌ విసిరారు. కాగా, భవిష్యత్‌లో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగవడం ఖాయమని మంత్రి కొడాలి జోస్యం చెప్పారు.

Also Read:

Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..

బిగ్ బాస్ 4: ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. ప‌నికి రానోళ్ల‌ను తోసేయండి: రాహుల్ సిప్లిగంజ్

డార్క్ చాక్లెట్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..