313 మంది రైతులు ఆత్మహత్య.!

చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. దాని ఫలితమే 2019లో..

313 మంది రైతులు ఆత్మహత్య.!

Updated on: Sep 03, 2020 | 8:30 PM

చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. దాని ఫలితమే 2019లో 313 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్న ఆయన.. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.7లక్షల ఆర్థిక సాయం ప్రకటించామని వివరించారు. జిల్లా కలెక్టర్‌ వెళ్లి ఆర్థికసాయం అందజేయాలని ఆదేశించామన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామస్థాయిలో విత్తనాలు అందించి, అసలు క్యూ లైన్లు లేకుండా చేస్తే.. క్యూ లైన్‌లో నిలబడి గుండెపోటుతో రైతులు చనిపోతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించడం దారుణమన్నారు. రైతు భరోసా పథకంతో రైతులకు భరోసా కల్పించామని.. ఇప్పటివరకు రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా చేస్తున్నామని.. లాక్‌డౌన్‌ సమయంలో అరటి నుంచి జామ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు. .