AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని లేఖ రాశారు. రాష్ట్రంలోని అధికారులు, పోలీసులు కరోనా విధుల్లో ఉన్నందున ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యం కాదని అందులో పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్‌ను తెలియజేస్తామని ఆమె అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని, ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని సాహ్ని తన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రధాన అధికారులతో నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల అంశం సెగలు పుట్టిస్తోంది. కరోనా కేసులు తగ్గుతుండటం వల్ల ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ఈసీ అభిప్రాయపడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చెయ్యట్లేదు. ఇక అలాగే టీడీపీ మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చింది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇవాళ ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల అభిప్రాయాలు వంటి అంశాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కు వివరించనున్నారు.
Also Read:
‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..
Flash News: ఫిబ్రవరిలో ఏపీ పంచాయితీ ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక ప్రకటన..?