Breaking News : ఏపీలో ఇంటర్ రిజ‌ల్ట్స్ విడుదల..

ఏపీ ఇంటర్ ఫ‌స్ట్, సెంకడ్ ఇయ‌ర్ రిజ‌ల్ట్స్ విడుద‌ల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు రిలీజ్ చేశారు. ఫలితాలు https://bie.ap.gov.in వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Breaking News : ఏపీలో ఇంటర్ రిజ‌ల్ట్స్ విడుదల..

Updated on: Jun 12, 2020 | 4:42 PM

ఏపీ ఇంటర్ ఫ‌స్ట్, సెంకడ్ ఇయ‌ర్ రిజ‌ల్ట్స్ విడుద‌ల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు రిలీజ్ చేశారు. ఫలితాలు https://bie.ap.gov.in వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా రిజ‌ల్ట్ తెలుసుకోవ‌చ్చు.

ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ 5,07,228 మంది, సెకండ్ ఇయ‌ర్ 4,88,795 మంది, ఒకేషనల్ ఫ‌స్ట్ ఇయ‌ర్ 39,139 మంది, సెకండ్ ఇయ‌ర్ 29,993 మంది మొత్తం 10,65,155 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు. ఇంటర్‌లో గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేసినందున ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, సెకండ్ ఇయ‌ర్ ఫలితాలు సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌ పాయింట్లలో ప్రకటించనున్నారు. ఇక ఫలితాల షార్ట్‌ మార్కుల మెమోలు ఈనెల 15వ తేదీ నుంచి స్టూడెంట్స్ కు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇంట‌ర్ పాస్ ప‌ర్సంటేజ్ వివ‌రాలు ఇలా ఉన్నాయి…

ఇంటర్ మొదటి సంవత్సరం 59 శాతం
ద్వితీయ సంవత్సరం 63 శాతం

బాలుర కంటే బాలికల పాస్ పర్సంటేజ్ అధికంగా ఉంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించ‌గా..వెస్ట్ గోదావరి, గుంటూరు.. సెకండ్, థ‌ర్డ్ ప్లేసుల్లో ఉన్నాయి.