Breaking : హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్‌ రమణమూర్తి సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్‌  నాగోల్‌లోని రాజీవ్ గృహకల్ప భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Breaking : హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

Updated on: Oct 01, 2020 | 12:18 PM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్‌ రమణమూర్తి సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్‌  నాగోల్‌లోని రాజీవ్ గృహకల్ప భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయన స్పాట్ లోనే  మృతిచెందారు. కుమార్తె నివాసానికి వెళ్లి ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రమణమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన రమణమూర్తి  ప్రస్తుతం ఏపీ అటవీశాఖలో అడిషనల్‌ చీఫ్ కన్జర్వేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రమణమూర్తి మృతిపై  ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్

ఏపీ గ్రామ సచివాలయ పరీక్షల ప్రాథమిక కీ విడుదల