ఏపీలో నేటినుంచి చిన్నారులకు విటమిన్ ఎ సిరప్ పంపిణీ

|

Oct 13, 2020 | 12:40 PM

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్లలోపు చిన్నారులు రేచీకటి బారిన పడకుండా నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 31 వరకూ అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్ ఏ సప్లిమెంటరీ సిరప్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ‘అక్టోబర్ 13 వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 సం.ల లోపు పిల్లలందరికీ విటమిన్-ఏ సప్లిమెంటేషన్ సిరప్ ఇస్తుంది. 5 సం. లోపు […]

ఏపీలో నేటినుంచి చిన్నారులకు విటమిన్ ఎ సిరప్ పంపిణీ
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్లలోపు చిన్నారులు రేచీకటి బారిన పడకుండా నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 31 వరకూ అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్ ఏ సప్లిమెంటరీ సిరప్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ‘అక్టోబర్ 13 వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 సం.ల లోపు పిల్లలందరికీ విటమిన్-ఏ సప్లిమెంటేషన్ సిరప్ ఇస్తుంది. 5 సం. లోపు పిల్లల తల్లితండ్రులు అందరూ దగ్గరలోని అంగనవాడి కేంద్రాన్ని సంప్రదించి మీ పిల్లలకి విటమిన్-ఏ సిరప్ వేయించండి. వారి ఆరోగ్య సురక్షితకు జాగ్రత్త తీసుకోండి’ అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కోరింది.