Flash: ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు విడుదల..

|

Oct 27, 2020 | 5:29 PM

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.

Flash: ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు విడుదల..
Follow us on

AP Grama Sachivalayam Exams: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. గత నెల 20వ తేదీ నుంచి 26  వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ రాత పరీక్షలు జరిగాయి. ఏపీ వ్యాప్తంగా దాదాపు 7,69,034 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌తో పాటు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ” సీఎం జగన్ గారి వినూత్న ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా అమలవుతున్న సంక్షేమ ఫలాలన్నీ లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరుతున్నాయి. సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,048 ఖాళీలు ఉన్నాయి. మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.