ఆంగ్ల మాథ్యమం.. హైకోర్టు తీర్పు పై.. సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..

| Edited By:

Jun 05, 2020 | 6:47 PM

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధనపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో గురువారం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు

ఆంగ్ల మాథ్యమం.. హైకోర్టు తీర్పు పై.. సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..
Follow us on

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధనపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు జారీ చేసిన జీవో 81, 85ని హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలని ఆదేశించింది. అయితే.. పేద విద్యార్థుల కోసమే ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తున్నామని పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది.

హైకోర్టు రద్దు చేసిన జీవోలపై.. సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని సర్కారు నిర్ణయించింది. 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియాన్నే కోరుకుంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్లో పేర్కొంది. పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్ మీడియం బోధనను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. .

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..