Andhrapradesh: ఏపీలో కుక్కలు, పందులు పెంపకానికి లైసెన్సులు జారీ..అలా చేస్తే యజమానులకు రూ.500 ఫైన్

|

Dec 29, 2020 | 6:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో కుక్కలు, పందులు పెంపకానికి జగన్ సర్కార్ లైసెన్సులు జారీ చేసింది.  లైసెన్సులు లేని జంతువుల నియంత్రణకు నిబంధనలు విడుదల చేసింది. 

Andhrapradesh:  ఏపీలో కుక్కలు, పందులు పెంపకానికి లైసెన్సులు జారీ..అలా చేస్తే యజమానులకు రూ.500 ఫైన్
Follow us on

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో కుక్కలు, పందులు పెంపకానికి జగన్ సర్కార్ లైసెన్సులు జారీ చేసింది.  లైసెన్సులు లేని జంతువుల నియంత్రణకు నిబంధనలు విడుదల చేసింది.  కుక్కలు, పందుల పెంపకం నియంత్రణకు సంబంధించి గతంలో జారీ అయిన నిబంధనల స్థానంలో కొత్తవాటిని అమలు చేసేందుకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు వెలువరించింది.

కుక్కలు, పందుల్ని పెంచుతున్న యజమానులు లైసెన్సు లేదా రెన్యూవల్ కోసం స్థానిక యంత్రాంగానికి దరఖాస్తు చేయాలని ఆదేశించింది.  కుక్కలకు సంబంధించి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించినట్టుగా ధృవీకరణ పత్రం పొందాలని సూచించింది. స్థానిక వెటర్నరీ వైద్యుల నుంచి పందులకు సంబంధించిన ఆరోగ్య పత్రం సమర్పిచాలని సూచనలు చేసింది.  స్థానిక గ్రామ పంచాయితీలు జారీ చేసిన లైసెన్సు టోకెన్లు పెంపుడు జంతువుల మెడల్లో ఉండాలని పేర్కొంది.  టోకెన్లనే లైసెన్సుగా భావిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  బహిరంగంగా సంచరించే జంతువులకు సంబంధించిన వివరాలతో బహిరంగ నోటీసు జారీ చేయాలని పంచాయితీలకు ఆదేశాలు జారీ చేసింది.

లైసెన్సులు ఉన్నప్పటికీ బహిరంగంగా సంచరించే కుక్కలు, పందులకు సంబంధించి వాటి యజమానులకు రూ. 500 చొప్పున జరిమానా విధించాలని ఆదేశించింది. సదరు స్థానిక సంస్థ పరిధిలోని జంతువులను పట్టుకుని యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీలు చేయాల్సిందిగా సూచనలు చేసింది. మూడు కేటగిరీలుగా విభజించి నియంత్రణా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.  వీధి కుక్కల విషయంలో స్టెరిలైజేషన్ చేయాలని సూచించింది. బ్రీడర్లు రిజిస్ట్రేషన్‌పై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో పాటు పర్యవేక్షణాధికారి ఆదేశాలు మేరకు వీధికుక్కలను పట్టుకుని తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. భారత జంతు సంక్షేమ బోర్డు ఆదేశాల మేరకు తీవ్ర ఆనారోగ్యం, గాయాల పాలైన కుక్కలను మాత్రమే కమిటీ సూచనలు మేరకు చంపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కడా అమానవీయ ధోరణితో వ్యవహరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నిర్దేశించిన వేళల్లో మాత్రమే సోడియం పెంటతాల్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని సూచించింది. కుక్క పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని ప్రభుత్వం సూచించింది. పందుల పెంపక కేంద్రాలు గ్రామానికి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండేలా చూడాల్సిందిగా పేర్కొంది.

Also Read :

 Newly married woman suicide : “అమ్మా..! అతడే గుర్తొస్తున్నాడు”..అత్తారింట్లో నవవధువు ఆత్మహత్య

Wife beats husband : అపరకాళిగా మారిన ఆళి..భర్తను జెండా కర్రకు కట్టేసి కొట్టింది..ఎందుకో తెల్సా..?

New Coronavirus Strain in AP : ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నమోదు..రాజమండ్రి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ

Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు

‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్