పేదలకు నాణ్యమైన వైద్యం : ఏపీలో 560 వైఎస్సార్ పట్టణ క్లినిక్​ల ఏర్పాటుకు ఉత్తర్వులు

|

Nov 25, 2020 | 7:21 AM

పేద వర్గాలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం..ఈ రెండు ప్రధాన లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారు.

పేదలకు నాణ్యమైన వైద్యం : ఏపీలో 560 వైఎస్సార్ పట్టణ క్లినిక్​ల ఏర్పాటుకు ఉత్తర్వులు
Follow us on

పేద వర్గాలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం..ఈ రెండు ప్రధాన లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా  పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు జగర్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. వైఎస్సార్ అర్బన్‌ క్లినిక్​ల ఏర్పాటుకు వైద్యశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్​ల ఏర్పాటు కోసం 355 కొత్త భవనాలు నిర్మించాలని, 205 బిల్డింగులకు మరమ్మతులు నిర్వహించి పరికరాలు సమకూర్చాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనికోసం జాతీయ ఆరోగ్య మిషన్‌, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి నిధులు మంజూరు చేస్తామని గవర్నమెంట్ వెల్లడించింది.

ఈ అర్బన్ క్లినిక్‌లు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ మాదిరిగా ఉంటాయి. ఢిల్లీలో పేద ప్రజలకు జ్వరం సహా చిన్న, చిన్న  జబ్బులు వస్తే ప్రవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక వెసులుబాటు ఉండదు. వారికి వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో కేజ్రీవాల్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో పరీక్షలు సహా అన్ని ఉచితం. ఈ వ్యవస్థ బాగుందని భావించిన సీఎం జగన్ ఆంధ్రాలోనూ వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో వీటిని గ్రామాల్లోనూ విస్తరించనున్నారు.