జగన్ ప్రభుత్వం.. ఏపీ విద్యార్థులకు గుడ్ ఆఫర్ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ఇచ్చే.. బస్‌పాస్ పరిధిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విద్యార్థుల బస్‌పాస్‌లకు.. దూరానికి సంబంధించి పరిధి 35 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. అయితే ఇప్పటి నుంచి దాన్ని 50 కిలోమీటర్లు వరకు పెంచుతూ.. అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా నిర్ణయంతో స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్కూల్, కాలేజీ విద్యార్థులు నగర శివారుల్లో ఉండటంతో ఇబ్బందిపడేవారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 35 కిలోమీటర్లు దాటి వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతూ వచ్చేవి. 35కి.మీలు దాటి వెళ్లే వారు.. అక్కడి నుంచి డబ్బులు పెట్టుకుని వెళ్లవలసి వచ్చేది. కాగా జగన్ సర్కార్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో వారికి కాస్త ఊరట కలిగింది. ఈ తాజా నిర్ణయంతో.. ప్రభుత్వంపై దాదాపు 18.50 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అధికారుల అంచనా.