ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

|

Sep 18, 2020 | 3:11 PM

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రేపటి నుంచి సిటీ బస్సులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా అనుమతులు ఇవ్వడంతో.. తొలి విడతలో భాగంగా శనివారం(19వ తేదీ) నుంచి...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!
Follow us on

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రేపటి నుంచి సిటీ బస్సులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా అనుమతులు ఇవ్వడంతో.. తొలి విడతలో భాగంగా శనివారం(19వ తేదీ) నుంచి విశాఖపట్నం, విజయవాడలో సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. దీనితో దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. (Green Signal To City Buses)

ఈ రెండు నగరాల్లోనూ తొలుత 200 నుంచి 300 బస్సుల వరకు తిప్పాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. బస్సుల్లో 60 శాతం ప్రయాణీకులను అనుమతించనుండగా.. ఈ నెల 20 నుంచి గ్రామ సచివాలయ పరీక్షలు జరుగనున్న నేపధ్యంలో రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం బస్సులను నడపనున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు టికెట్ ధరలు ఒకే విధంగా ఉండేలా నిర్ణయించాలని చూస్తుండగా.. దీనిపై శనివారం క్లారిటీ రానుంది. ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!