విజయవాడలో పేదలకు లక్ష ఇళ్ళు. పేదలకు సొంత ఇంటి కల నిజం చేయడానికి జగన్ సర్కారు బాసటగా నిలిచింది. అందులో భాగంగా వారికి సొంత ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది ఏపీ ప్రభుత్వం. విజయవాడలో లక్ష ఇళ్లు నిర్మించడానికి వెయ్యి కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీ ప్లస్ త్రీ పద్దతిలో ఎకరానికి 100 ఇళ్ల చొప్పున, మొత్తం లక్ష ఇళ్లను వెయ్యి ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండగా.. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం నగర శివారులో స్థలాలను కూడా సేకరిస్తున్నారు.