అలా చేస్తుంటే చూస్తూ ఊరుకోను : చంద్రబాబు

| Edited By:

Aug 31, 2019 | 7:25 PM

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు, పేదల జోలికి వస్తే చూస్తూ ఉరుకోనంటూ హెచ్చరించారు. ఇప్పటికే పోలవరం, అమరావతి పనులను నిలిపివేశారని ఆ ప్రాంత ప్రజలను ఆకాంక్షలను కూల్చివేశారంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం ఇది అంటూ చంద్రబాబు తీవ్రస్ధాయిలో విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను వెళ్లగొడుతూ తుగ్లక్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటు ప్రగతిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో లక్షల మంది […]

అలా చేస్తుంటే చూస్తూ ఊరుకోను : చంద్రబాబు
Follow us on

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు, పేదల జోలికి వస్తే చూస్తూ ఉరుకోనంటూ హెచ్చరించారు. ఇప్పటికే పోలవరం, అమరావతి పనులను నిలిపివేశారని ఆ ప్రాంత ప్రజలను ఆకాంక్షలను కూల్చివేశారంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం ఇది అంటూ చంద్రబాబు తీవ్రస్ధాయిలో విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను వెళ్లగొడుతూ తుగ్లక్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటు ప్రగతిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.